Thu Jan 29 2026 11:44:41 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ పై ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే.. ఫస్ట్ టైం
వైఎస్ జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత పై నిప్పులు చెరిగారు

వైఎస్ జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధనేత పై నిప్పులు చెరిగారు. పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాను జగన్ చెప్పిన పనులన్నీ చేశానని ఆయన అన్నారు. జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు.
దళితులున్న చోటు మాత్రమే...
తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. తిరుపత్తి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన ఫైర్ అయ్యారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని అన్నారు. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
Next Story

