Thu Apr 02 2026 23:40:09 GMT+0530 (India Standard Time)
ఆ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్.. అందుకేనట
ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది

ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే సందేశాలు వెళ్లాయి. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణపైన కూడా జగన్ ఈ సమావేశంలో మరింత స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
మూడేళ్ల తర్వాత....
మూడేళ్ల తర్వాత వైసీపీ ఎల్పీ సమావేశం జరుగుతోంది. జగన్ నేరుగా ఎమ్యెల్యేలను కలసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రెండు సంవత్సరాలు నియజకవర్గాలను వీడి వెళ్ల కూడదని జగన్ చెప్పనున్నారు. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలేసి వ్యాపారాలపై దృష్టి పెట్టారన్న ఆరోపణలున్నాయి. వారిని ఇక నియోజకవర్గాలను వదిలి వెళ్లకూడదన్న ఆదేశాలు జారీ చేయనున్నారు.
ప్రధాన సమస్యలపై....
అలాగే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై కూడా చర్చించనున్నారు. కొందరి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా జగన్ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధిపత్య ధోరణి కారణంగా గ్రూపులు ఏర్పడ్డాయి. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని, అందరినీ కలుపుకుని పోవాలని జగన్ వారికి దిశానిర్దేవం చేయనున్నారు.
Next Story

