Sun Mar 08 2026 02:38:55 GMT+0530 (India Standard Time)
YSRCP : భీమిలీ సభలోగానే మార్పులు.. నేతల్లో టన్షన్
ఐదో జాబితాపై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది. నేడో, రేపు జాబితాను విడుదల చేసే అవకాశముంది

ఐదో జాబితాపై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది. ఈరోజు కూడా రాష్ట్రంలోని అనేక మంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని తెలిసింది. దీంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కడుతున్నారు. ఈరోజు, రేపటిలోగా ఐదో జాబితాను వైసీపీ విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తారన్నది వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది.
ఐదో విడత జాబితా...
ిఇప్పటికే నాలుగు విడతలుగా నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేపట్టారు. దాదాపు యాభై ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు, పది పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం కల్పించగా, మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపారు. ఈనెల 25వ తేదీలోగా పూర్తి స్థాయిలో మార్పులు చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. 25వ తేదీన భీమిలీలో జరిగే సభ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
Next Story

