Sun Jan 12 2025 20:58:51 GMT+0000 (Coordinated Universal Time)
Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు షాకిచ్చిన సొంత బాబాయి
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఊహించని షాకులు
Anil Kumar Yadav:వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. సొంత బాబాయ్ వైసీపీని వీడారు. బాబాయి రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు బాధించాయని రూప్‌కుమార్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి సేవ చేశానని, పార్టీ కోసం కష్టపడ్డామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నామని, తనను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చారని.. కానీ ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు మాత్రం తమను బాధించాయన్నారు. అందుకే పార్టీని వీడాల్సి వస్తుందన్నారు రూప్‌కుమార్.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను నెల్లూరు నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఇటీవలే ప్రకటించారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ ను నియమించడంతో రూప్‌కుమార్ వర్గం కాస్తా డీలా పడింది. అంతేకాకుండా రూప్ కుమార్ తన అనుచరులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొద్దిరోజులకు ఈ వివాదాలు సద్దుమణిగినట్లు అనిపించినప్పటికీ.. చివరికి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ వైసీపీని వీడాలనే నిర్ణయం తీసుకున్నారు.
Next Story