Mon Mar 16 2026 02:38:45 GMT+0530 (India Standard Time)
ఆమంచిని అరెస్ట్ చేస్తారా?
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ నేడు సీబీఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ నేడు సీబీఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయానికి మరికాసేపట్లో ఆమంచి చేరుకుంటారు. సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన సీబీఐ విచారణకు సహకరిస్తానని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఏ విచారణకైనా సిద్ధమని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.
సీబీఐ ఎదుటకు నేడు ఆమంచి
కాగా న్యాయవ్యవస్థ పై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలపై సీబీఐ విచారణకు పిలిపించింది. గతంలోనూ విచారించింది. మరోసారి ఆమంచిని పిలవవడంతో సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా? అన్న ఆందోళన ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. చీరాల నుంచి పెద్ద సంఖ్యలో ఆమంచి అనుచరులు విజయవాడ చేరుకుంటున్నారు. పోలీసులు సీబీఐ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

