Thu Jan 29 2026 18:03:36 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు వైసీపీ యువత పోరు
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైసీపీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిరుద్యోగులకు అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ వైసీపీ ఈ ఆందోళనలను నిర్వహిస్తుంది. ఫీజు రీఎంర్స్ మెంట్, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేయనుంది.
కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ
విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి నేడు పోరాటానికి దిగాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వరకూ భారీ ర్యాలీని చేసేందుకు సిద్ధమయింది. కలెక్టర్లకు వినతిపత్రాలను వైసీపీ నేతలు విద్యార్థులతో కలసి ఇవ్వనున్నారు. దీంతో ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు పాల్గొనే చోట పోలీసులు నిఘా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Next Story

