Fri Jan 30 2026 04:09:26 GMT+0000 (Coordinated Universal Time)
చీరాలలో వైసీపీ నేతలు జంప్
చీరాలలో వైఎస్సార్సీపీకి షాక్తగిలింది. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి

చీరాలలో వైఎస్సార్సీపీకి షాక్తగిలింది.వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. మెుత్తం పదకొండు మంది వైసీపీ, స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పదకొండు మంది కౌన్సిలర్లు...
కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలనను అందేంచేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షణీయమమని టీడీపీ ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు.. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరికొందరు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story

