Thu Mar 12 2026 10:49:10 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది

నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. వైఎస్ జగన్ ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పార్టీ కార్యాలయంలో వేడుకలలో జగన్ పాల్గొననున్నారు. పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రమంతటా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
పదిహేనేళ్లయిన సందర్భంగా...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ 2011న కొత్తపార్టీని ఇడుపులపాయలో ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించి నేటికి పదిహేనేళ్లు అయిన సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

