Tue Mar 24 2026 18:09:45 GMT+0530 (India Standard Time)
Ys Jagan : ఓటమి తర్వాత తొలిసారి పులివెందులకు జగన్
మూడు రోజుల పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు.

మూడు రోజుల పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటించనున్నారు. వచ్చే నెల 2వ తేదీన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు భాకరాపేటలోని క్యాంప్ కార్యాలయానికి వైఎస్ జగన్ చేరుకుంది.
మూడు రోజుల పాటు...
ఎల్లుండి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లిలో గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. పులివెందులలో ఎంపీటీసీ ఎన్నిక జరిగిన తర్వాత తొలిసారి జగన్ వస్తుండటంతో భారీగా అభిమానులు వచ్చే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు.
Next Story

