Mon Mar 23 2026 23:15:30 GMT+0530 (India Standard Time)
Ys Jagan : గుంటూరుకు చేరుకున్న జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు చేరుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన పర్యటనకు అభిమానులు తరలి వచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటనలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరు చేరుకున్నారు. పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని చెప్పినా వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. తాడేపల్లి నుంచి గుంటూరు వరకూ దారిపొడవునా కార్యకర్తలు జగన్ కు స్వాగతం పలికారు.
భారీగా కార్యకర్తలు తరలి రావడంతో...
ఆయన వాహనంపై పూలవర్షం కురిపించారు. జగన్ తో ఫొటో దిగేందుకు పోటీ పడ్డారు. ఇప్పటికే పోలీసులు గుంటూరు నగరంలో అనేక చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి జగన్ వాహనాన్ని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. జగన్ తాడేపల్లి నుంచి గుంటూరుకు చేరుకున్నా అంబటి రాంబాబు ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దాడులు జరిగిన ప్రాంతాలను జగన్ పరిశీలించి అంబటికుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.
Next Story

