Sat Dec 13 2025 22:27:49 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రాజీనామాలు చేసేద్దాం.. ఉప ఎన్నికలకు వెళదాం..జగన్ కీలక వ్యాఖ్యలు
Ys Jagan : రాజీనామాలు చేసేద్దాం.. ఉప ఎన్నికలకు వెళదాం..జగన్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేస్తే వేసుకోనివ్వాలని ఆయన అన్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళదామని వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలుచేశారు. తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని చెప్పలేదని, తాము ప్రజాసమస్యలను ప్రస్తావించడానికి తగిన సమయం ఇస్తామని అధికారపార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదన్నారు.
సమయం ఇస్తే రావడానికి...
తాను కూడా అసెంబ్లీకి వెళ్లవద్దని ఏ ఎమ్మెల్యేకు చెప్పాలేదన్న జగన్ వాళ్లు వెళ్లదలచుకుంటే అసెంబ్లీకి వెళ్లవచ్చునని అన్నారు. సభ్యుల బలం చూపెట్టి మందబలాన్ని ఉపయోగించి చర్చలను పక్కదారి పట్టిస్తే ఎలా అనిఆయన ప్రశ్నించారు. సమయం ఇవ్వకుండా శాసనసభలో ప్రజాసమస్యలను ఎలా ప్రస్తావించాలని ఆయన అన్నారు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యలపై చర్యలు తీసుకుంటే అందరం కలసి రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలకు వెళదామనిజగన్ అన్నారు. ఎవరికైనా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని, తనకు అభ్యంతరం లేదని,వెళ్లి అభాసుపాలు కావద్దనే తన అభిప్రాయమని జగన్ అన్నారు
Next Story

