Fri Dec 05 2025 14:18:39 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పులి వెందుల ఎన్నిక వేళ జగన్ లేటెస్ట్ ట్వీట్
పులి వెందుల ఎన్నిక వేళ వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు.

పులి వెందుల ఎన్నిక వేళ వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని ట్వీట్ చేశారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయన్న జగన్ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అని అన్నారు.
అధికార దుర్వినియోగం చేస్తూ...
ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారన్న జగన్ ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలన్నారు. అయినా దేవుడిమీద నమ్మకం ఉందని, ప్రజలమీద నమ్మకం ఉందని అంతిమంగా ధర్మమే గెలుస్తుందని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story

