Sat Dec 13 2025 19:28:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగండి : వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంపై ఆందోళన ఉధృతం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు

చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంపై ఆందోళన ఉధృతం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. చంద్రబాబు నాయుడు స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో మూడేళ్లలో పది హేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, పత్రి జిల్లాకో గవర్నమెంట్ కాలేజీ తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో సమావేశమయిన వైఎస్ జగన్ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదని, ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ...
చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారన్నారన్నారు. ఇలాంటి వారిని ప్రశ్నించి, నిలదీసే బాధ్యత విద్యార్థులదేనని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న ర్యాలీలు. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై డిసెంబర్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇద్దామని, పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని, కేవలం విద్యా దీవెన పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చామని, వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఇరవై వేలు ఇచ్చామని గుర్తు చేశారు.
Next Story

