Thu Mar 12 2026 14:08:18 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ భావోద్వేగం చూశారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. 2011లో పార్టీని స్థాపించినప్పుడు తాను ఒక్కడినే ఉన్నానని, ఇప్పుడు తనకు కోట్లాది మంది కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని అన్నారు. పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీకి కార్యకర్తలే బలం, అండ అని జగన్ అన్నారు.
కార్యకర్తలే అండగా...
వైసీపీ ఆవర్భవించి పదహారేళ్లు అయిన సందర్భంగాతాడేపల్లి ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభిమాని కాలర్ ఎత్తుకుని తిరిగేలా పార్టీ ఉంటుందని చెప్పారు. తాను మొదటి నుంచి దేవుడినే నమ్ముకుని ఉన్నానని, కార్యకర్తల కష్టంతోనే పార్టీ వ్యవహరిస్తుందని చెప్పారు. విలువలకు, విశ్వసనీయతకు తాను ఎప్పటికీ కట్టుబడి ఉంటానని చెప్పారు. వైసీపీని అభిమానించే ప్రతిగుండెకు తాను శుభాకాంక్షలు చెబుతున్నానని వైఎస్ జగన్ భావోద్వేగంతో అన్నారు.
Next Story

