Thu Jan 29 2026 15:08:23 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : పార్టీ మార్పుపై అయోధ్యరామిరెడ్డి క్లారిటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామాపై స్పందించారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామాపై స్పందించారు. పార్టీ మార్పుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడటం లేదని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలలో నిజం లేదన్న ఆయన ఆ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మవద్దని కోరారు.
సహజమేనంటూ...
ప్రతి పార్టీకి కొన్ని ఎత్తుపల్లాలు రాజకీయంగా సహజంగా ఉంటాయని అయోధ్య రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీలోనూ కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళతామని ఆయన తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని అయోధ్య రామిరెడ్డి ఖండించారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగేపార్టీ మనగలుగుతుందన్న ఆయన విజయసాయిరెడ్డి బెదిరింపులకు లొంగేవ్యక్తి కాదనితెలిపారు.
Next Story

