Tue Jan 20 2026 01:32:30 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ...పాత రంకులన్నీ బయటపడుతున్నాయ్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఘాటుపై విమర్శలు చేశారు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఘాటుపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో మండి పడ్డారు. పనీ పాట లేక సోది చెప్పించుకుంటే పాత రంకులన్నీ బయటపడ్డాయని సామెత అని, ఆంధ్రప్రదేశ్ ను శ్రీలంక చేయాలనుకున్నది వఎవరు అన్న సెన్స్ లో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు టీడీపీయే అని సమాధానం అని చెప్పారన్నారు.
బడ్జెట్ ఆమోదం లేకుండా..
2014 - 2018 సంవత్సరాల్లో 1,62,828 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదం లేకుండా అప్పటి ప్రభుత్వం వాడేసిందని మంత్రి సమాధానం చెప్పారని విజయసాయి రెడ్డి అన్నారు ఇందుకు కారణం చంద్రబాబే అని పరోక్షంగా చెప్పారన్నారు. అప్పుల పాలు చేసింది చంద్రబాబే అని చెప్పుతో బాబును కొట్టినట్లయిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story

