Thu Mar 19 2026 02:43:01 GMT+0530 (India Standard Time)
నాలుగు స్థానాలు వైసీపీ కైవసం
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో నాలుగు స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఏ పార్టీకి శాసనసభలో రాజ్యసభ స్థానం గెలుచుకునే స్థాయిలో సీట్ల సంఖ్య లేకపోవడంతో ఏ పార్టీ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.
నలుగురు....
వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఏపీ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వారికి ధృవీకరణ పత్రాలను అంద చేశారు. దీంతో నలుగురు సభ్యులు వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికయినట్లయింది. రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం మరింత పెరిగింది.
Next Story

