Wed Jan 21 2026 07:09:47 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేయనుంది. అధినేత జగన్ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేయనుంది. వైసీపీ అధినేత జగన్ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుతమున్న నవరత్నాలను అప్ గ్రేడ్ చేస్తూ మ్యానిఫేస్టోను రూపొందించారని తెలిసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న నమ్మకం తెచ్చుకున్న జగన్ అతి విషయాలకు పోకుండా మ్యానిఫేస్టోను రూపొందించారని తెలిసింది.
సంక్షేమ పథకాలతో పాటు...
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా ఈ మ్యానిఫేస్టోకు రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఎలాంటి హామీలను జగన్ ఇవ్వనున్నారన్న దానిపై రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ఈ మ్యానిఫేస్టోలో ఉపాధి కల్పనపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావన ఉంటుందని చెబుతున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈ మ్యానిఫేస్టోను రూపొందించనున్నారని తెలిసింది. మహిళలు, యువత, పారిశ్రామికీకరణ వంటి విషయాలపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. రైతు రుణమాఫీ ప్రకటన చేస్తే లక్ష రూపాయల వరకూ ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
Next Story

