Tue Jan 20 2026 12:07:26 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి రఘురామ మరో ఛాలెంజ్
తాను త్వరలోనే రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు.

తాను త్వరలోనే రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తన రాజీనామా ఉంటుందని ఆయన తెలిపారు. తనకు, వైసీపీకి మధ్య బంధం తెగిపోయినట్లేనని ఆయన చెప్పారు. తాను ఫిబ్రవరి 5వ తేదీ వరకూ వైసీపీ పెద్దలకు గడువు ఇచ్చానని, ఆ లోపు తనపై అనర్హత వేటు వేయించుకోవచ్చని రఘురామ కృష్ణరాజు ఛాలెంజ్ చేశారు.
అందుకే రాలేకపోతున్నా.....
తాను సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా వైసీపీ నేతలే అడ్డుకుంటున్నారని, తాను వెళ్లాలనుకుంటున్నప్పుడల్లా సీఐడీ చేత నోటీసులు ఇప్పిస్తున్నారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. అందుకే తాను నియోజకవర్గానికి వెళ్లలేకపోతున్నానని అక్కడి ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.
Next Story

