Sat Dec 06 2025 09:39:59 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ పై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి
టీడీపీకి చెందిన నేతలు తమతో టచ్ లోకి వచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వారితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు

టీడీపీకి చెందిన పెద్ద నేతలు తమతో టచ్ లోకి వచ్చారని వైసీీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. వారితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదని ఆ పార్టీ ఎంపీయే చెప్పిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వంలోనే పార్టీ మూతపడటం ఖాయమని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
లోకేష్ అడివి మనిషి.....
వైసీీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ అడవిలో ఉండాల్సిన వ్యక్తి అని అన్నారు. ఆయన మాట్లాడే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. లోకేష్ బాడీ లాంగ్వేజీ, వాడే పదాలు అభ్యంతరకంగా ఉన్నాయని, ఆయనకు ఆ సలహాలు ఇస్తుంది ఎవరో కాని, తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story

