Sun Mar 15 2026 11:54:39 GMT+0530 (India Standard Time)
మోదీని కలిసిన విజయసాయిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు

ప్రధాని నరేంద్ర మోదీతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై విజయసాయిరెడ్డి చర్చించారు. విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలను పరిష్కరించాలని ఆయన ప్రధానిని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలపై..
ప్రధాని మోదీ విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలను విని సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విడుదల, వరద సాయం వంటి అంశాలను విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. పార్లమెంటులో తాము లేవనెత్తిన ఏపీకి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Next Story

