Fri Dec 05 2025 22:47:58 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : బీజేపీ రాష్ట్ర చీఫ్ పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు.. " బావా " తీతమైన ఆవేదన అంటూ ట్వీట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి పై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు

"బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి పై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలను తప్పు పట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి." అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
2) "పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసింది. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి. ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి! కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా...గోవిందా.
3)చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డుప్రసాదాల విషయంలో దెబ్బయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు" అంటూ ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.
Next Story

