Fri Dec 05 2025 14:35:44 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి జైలుకు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగియడంతో మిధున్ రెడ్డి నేడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రికి చెందిన వైసీపీనేతలు భారీ సంఖ్యలో జైలు ప్రాంగణం వద్దకు తరలి వచ్చారు. పూజారులు ఆయనకు ఆశీర్వచనాలు అందచేసిన తర్వాత జైలులోకి వెళ్లిపోయారు. మిధున్ రెడ్డి రిమాండ్ గడువు రేపటితో ముగియనుండటంతో ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు.
బెయిల్ గడువు ముగియడంతో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి అరెస్టయి 47 రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. ఆయనకు ఇటీవల ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు, వైసీపీ పార్లమెంటు నేతగా తమ పార్టీకి చెందిన ఎంపీలను సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఐదు రోజులు పాటు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో నేడు గడువు పూర్తి కావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఆయన జైలులో లొంగిపోయారు. రేపు ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డిని హాజరుపర్చనున్నారు.
Next Story

