Sat Dec 06 2025 01:53:12 GMT+0000 (Coordinated Universal Time)
జగనన్న కటౌట్ తోనే కుప్పంను కుమ్మేశాం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయి మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయి మండిపడ్డారు. కుప్పంలో ఓటమి పాలయిన చంద్రబాబు అసెంబ్లీలోకి కూడా రాలేదన్నారు. ఆయన మొహం చూడాలని ఉందన్నారు. కుప్పంలో జగనన్న కటౌట్ తోనే అక్కడ పార్టీ ని గెలిపించారన్నారు. ఓటమి పాలయిన టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేయడం విడ్డూరంగా ఉందని రోజా అన్నారు. మహిళా సాధికారికతపై రోజా అసెంబ్లీలో మాట్లాడారు.
మురికి కాల్వలో....
కుప్పం కోట కరిగిపోయినా టీడీపీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వం తమకు వద్దంటూ కుప్పం ప్రజలు ఆ పార్టీని మురికి కాల్వ లో కలిపేశారన్నారు. సింహాన్ని వేటాడటం, జగన్ తో ఆటాడుకోవడం కుదరదని రోజా అన్నారు. చరిత్ర సృష్టించిన జగన్ కు హ్యాట్సాఫ్ అన్నారు. చంద్రబాబు నియోజకవర్గ ప్రజలే జగనన్న కు అండగా ఉంటామని కుప్పం ప్రజలు చెప్పారన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు కుప్పం సందుల్లో తిరగాల్సి వచ్చిందని రోజా అన్నారు.
Next Story

