Mon Mar 23 2026 11:23:50 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు రోజా ఛాలెంజ్
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన పార్టీ కార్యకర్తలు, నేతలను కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికల ప్రచారం అంటూ రోజా దుయ్య బట్టారు. చంద్రబాబుకు ఎన్నికల పట్ల అంత మోజు ఉంటే ఆయన రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని రోజా సవాల్ విసిరారు.
పార్టీని కాపాడుకునేందుకే....
తన పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు మూడేళ్ల ముందు నుంచే ఈ ప్రచారం చేస్తున్న విషయాన్ని రోజా గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్ని సార్లు పర్యటించినా చంద్రబాబుకు ఈసారి ఓటమి తప్పదని రోజా హెచ్చరించారు. జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న సంక్షేమ పథకాలే వైసీీపీ అభ్యర్థిని కుప్పంలో గెలిపిస్తాయని రోజా అన్నారు. ఈరోజు రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Next Story

