Tue Apr 07 2026 05:25:22 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది

నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించి నిలదీసే విధంగా వ్యవహరించాలని ముఖ్యంగా వైఎస్ జగన్ శాసనమండలి సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
శాసనసభ సమావేశాల్లో...
అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయిన నేపథ్యంలో శాసనసభకు వెళ్లాలా? వద్దా? అన్నది కూడా జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకోని నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. శాసనసభను బహిష్కరించి తమ నిరసనను తెలియచేస్తే ఎలా ఉంటుంది? అలాగే సభకు వెళ్లి నిరసన తెలిపి వాకౌట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సీనియర్ నేతల సలహాలు తీసుకుని ఒక నిర్ణయాన్ని నేడు జగన్ ప్రకటించే అవకాశముందని అంటున్నారు.
Next Story

