Sun Mar 15 2026 16:56:24 GMT+0530 (India Standard Time)
కమిషనర్ పై దాడికి దిగిన వైసీపీ నేతలు
రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కమిషనర్ ఛాంబర్ లోకి వెళ్లి ఆయననపై కౌన్సిలర్ నరిసింమహారెడ్డి, మరో కౌన్సిలర్ భర్తదాడికి దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడం వల్లనే వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ రాంబాబుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. తాము ఇచ్చిన దరఖాస్తును తిరస్కరించడంతో ఆగ్రహంతో కౌన్సిలర్ ఆయన అనుచరులు కమిషనర్ పై దాడికి దిగారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటా...
అయితే రాయచోటి మున్సిపల్ కమిషనర్ పై దాడిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. ఎవరిపైనైనా దాడి చేయడం సరికాదన్నారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న ఆయన దాడి చేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాయచోటి పట్టణంలో లే అవుట్ల విషయంలో గతంలో జరిగిన తప్పులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story

