Sun Dec 14 2025 11:36:15 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు మూడో జాబితా విడుదల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మూడో జాబితాను నేడు విడుదల చేసే అవకాశముంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మూడో జాబితాను నేడు విడుదల చేసే అవకాశముంది. మొత్తం ముప్పయి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మూడో జాబితాలో మొత్తం పదమూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరించారని కూడా పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
నిన్న రాత్రే విడుదలకు...
నిజానికి నిన్న రాత్రే మూడో జాబితాను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఒకటి, రెండు మూడు స్థానాల్లో క్లారిటీ రాకపోవడం, మంత్రి బొత్స సత్యానారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘాలతో సమ్మె విరమణపై చర్చలు జరుపుతున్నందున ఈరోజుకు మూడో జాబితాను వాయిదా వేశారని తెలుస్తోంది. తొలి జాబితో పదకొండు, రెండో జాబితాలో ఇరవై ఏడు శాసనసభ నియోజవర్గాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.
Next Story

