Fri Dec 05 2025 10:52:02 GMT+0000 (Coordinated Universal Time)
నా పూర్తి మద్దతు : జగన్
మహిళ రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నామని జగన్ ప్రకటించారు.

మహిళ రిజర్వేషన్ బిల్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నామని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తాను తన పార్టీ తరుపున మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడానికి గర్వపడుతున్నానని తెలిపారు.
ఇప్పటికే తమ ప్రభుత్వంలో...
మన మహిళలకు సాధికారత కల్పించడం తమకు చాలా ముఖ్యమని తెలిపారు. దానిని నమ్మే ప్రభుత్వం తమదని జగన్ పేర్కొన్నారు. తాము ఆంధ్రప్రదేశ్లో గత నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల అమలు ద్వారా మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చామని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాన ప్రాతినిధ్యాన్ని సాధించమని తెలిపారు. మనం కలిసి మరింత గొప్ప మరియు సమానమైన భవిష్యత్ను సృష్టిద్దామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
Next Story

