Mon Mar 16 2026 17:45:36 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు కడప జిల్లాకు జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉండనున్నారు

వైసీపీ అధినేత జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉండనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కడప ఎయిర్ పర్టుకు చేరుకుని అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
సొంత నియోజకవర్గంలో...
తర్వాత అక్కడి నుంచి గొందిపల్లికి చేరుకుని నూతనంగా వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డు ఛైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించనున్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ మూడు రోజుల పాటు ఉంటారు.కార్యకర్తలను కలుసుకుంటారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
Next Story

