Fri Dec 05 2025 21:07:44 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ శాసనసభకు హాజరుపై క్లారిటీ ఇచ్చారుగా
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేవ్ శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశం కనిపించడం లేదు.

వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేవ్ శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. అవసరమైతే తనపై అనర్హత వేటు వేసి పులివెందులకు ఉపఎన్నిక వచ్చినా పరవాలేదన్న ధోరణి ఆయనలో కనిపించింది. తాను మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే శాసనసభకు వచ్చినా ప్రయోజనం ఉండదని, ప్రజా సమస్యలపై ప్రస్తావించడానికి అవసరమైన తగిన సమయం తనకు దొరకదని కూడా ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేత హోదా ఇస్తే...
ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రజల సమస్యలపై శాసనసభలో ప్రస్తావించడానికి తగిన సమయం దొరుకుతుందని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభ పక్ష నేతకు సమానంగా సమయాన్ని ప్రతిపక్ష నేతకు స్పీకర్ సమయం ఇవ్వాల్సి వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పటికీ ఇవ్వకపోవడానికి అదే కారణమి అన్నారు. వైసీపీని ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇస్తామని చెబుతున్నారని అన్నారు.
తాను నేరుగా ఆందోళనలకు...
దీంతో వైఎస్ జగన్ రానున్న శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యేందుకు సుముఖంగా లేరని అర్ధమవుతుంది. ఆరోజుల్లో అసెంబ్లీకి చంద్రబాబు రాకపోయినా ఏం చేయలేరన్నారు. ఏం చేయదలచుకున్నా ఈ మూడేళ్లు మాత్రమే చేయగలగరని, తర్వాత మాత్రం ఏమి చేస్తారని ప్రశ్నించారు. తాను కూడా నేరుగా ప్రజాందోళనలో పాల్గొంంటానని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలలను ప్రయివేటీకరించకుండా ఆందోళనలకు దిగుతామని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సుకోరే అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని జగన్ పిలుపు నివ్వడంతో ఇక జగన్ నేరుగా రంగంలోకి దిగుతానని, ఉప ఎన్నికలకు తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పారు.
Next Story

