Mon Mar 09 2026 21:54:45 GMT+0530 (India Standard Time)
నేడు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం
ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది

ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులుపై...
ప్రధానంగా రాష్ట్రంలో గత నలభై ఐదు రోజలుగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులతో పాటు కూల్చివేతల వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో చేపట్టబోయే ధర్నా విషయంపై కూడా జగన్ ఎంపీలతో జరిగే సమావేశంలో చర్చించనున్నారు.
Next Story

