Sat Dec 06 2025 14:29:01 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై.. కారణాం ఏం చెప్పారో తెలుసా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు

ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నేతలు వరసా వీడుతున్నారు. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్ ను వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీగా చేశారు. అయితే ఈసారి ఆయనకు హిందూపురం టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో గత కొంతకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
ఎమ్మెల్సీ పదవికి కూడా...
వైఎస్సార్సీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అియతే వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ కు కూడా పంపారు. దీంతో అనంతపురం జిల్లాలో వైసీపీకి ఎన్నికల వేళ రాజకీయంగా ఇబ్బందులు తప్పవని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story

