Sat Mar 07 2026 16:35:52 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని నేతలు వీడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు.

మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని నేతలు వీడుతున్నారు. పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. అధికారం కోల్పోవడంతో చాలా మంది నేతలు ఇప్పటికే వైసీపీిని వీడారు. మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కిలారు రోశయ్యలు వైసీీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలసి పనిచేస్తానని ఆయన చెప్పారు. పెండెం దొరబాబుకు గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ టిక్కెట్ ఇవ్వలేదు.
టిక్కెట్ దక్కకపోవడంతో...
అక్కడ వంగా గీతకు వైసీపీ టిక్కెట్ దక్కింది. అయితే వైసీపీ టిక్కెట్ తనకు దక్కకపోయినా ఎన్నికల్లో వంగా గీతకు అనుకూలంగా పనిచేసిన పెండెం దొరబాబు ఫలితాల తర్వాత మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమైన పెండెం దొరబాబు కొద్దిసేపటి క్రితం వైసీీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కొద్ది రోజుల్లోనే జనసేనలో చేరే అవకాశాలున్నాయి.
Next Story

