Thu Feb 05 2026 22:50:28 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్సార్ అవార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖలకు అవార్డులు అందించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖలకు అవార్డులు అందించారు. ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మందికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. 23 లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డ్స్, నాలుగు వైఎస్సార్ అఛీవ్ మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సమావేశానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే మొదటి సారిగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటును ప్రభుత్వం చేసిందన్నారు. నవరత్నాల ద్వారా బడుగు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నారని తెలిపారు. ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చారన్నారు.
వరసగా మూడోసారి...
ఈ కార్యక్రమానికి విజయమ్మ కూడా హాజరయ్యారు. వరసగా మూడో ఏడారి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పేరిట అవార్డులను అందిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ అవార్డులను అందించే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది 27 మదికి వైఎస్సార్ అవార్డులను అదచేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు. వ్యవసాయంలో పంగి వినీత, మల్లారెడ్డి అవార్డులు అందుకున్నారు. వ్యవసాయం, ఆర్ట్ అండ్ కల్చర్, తెలుగు భాష - సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ రంగాల్లో ఈ పురస్కారాలను అందచేశారు.
Next Story

