Thu Jan 16 2025 21:29:39 GMT+0000 (Coordinated Universal Time)
జగన్కు వైఎస్ సౌభాగ్యమ్మ ఘాటు లేఖ.. ఇంత దారుణమా అంటూ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఒక కుమారుడిగా జగన్ ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసునని, మనో వేదన అనుభవించారని, 2009లో జరిగిన ఈ ఘటన అందరినీ బాధించిందన్నారు. మరి 2019లో తండ్రిని కోల్పోతే సునీత కూడా అంతే బాధపడుతుందని ఎందుకు గుర్తించలేకపోతున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
హత్య చేయించిన వారికి...
వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా ఎవరు హత్యచేశారో? చేయించారో? తెలిసి కూడా వారికి వత్తాసు పలకడమేంటని ఆమె లేఖలో ప్రశ్నించారు. మనకుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం తమను మరింత బాధపెడుతుందని ఆమె అన్నారు. హత్యచేసిన వారికి,చేయించిన వారికి నువ్వు రక్షణగా ఉండటమేంటని ఆమె జగన్ కు రాసిన లేకలో ప్రశ్నించారు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించిన మీ చిన్నాన్నను దారుణంగా హత్యచేస్తే దానిని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావంటూ ప్రశ్నించారు. పైగా తమపైనే ఎదురుదాడికి దిగడమేంటని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు.
Next Story