Fri Mar 20 2026 14:05:39 GMT+0530 (India Standard Time)
Ys Viveka : వివేకా హత్య కేసు వచ్చే ఎన్నికల వరకూ కొనసాగేటట్లుందిగా?
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కేసులో తర్వాత ఎవరినీ విచారించే అవసరం లేదని చెప్పింది

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కేసులో తర్వాత ఎవరినీ విచారించే అవసరం లేదని చెప్పింది. అయితే రాజకీయంగా మాత్రం ఈ కేసు విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్రి సునీత జగన్ ను, భారతి రెడ్డిలను విచారించాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఆ దిశగా ఎందుకు విచారణ చేయలేదని మిలయన్ డాలర్ల ప్రశ్న అంటూ సునీత ధ్వజమెత్తారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి వైఎస్ సునీత చంద్రబాబును రాజకీయంగా ఆదుకోవడానికే ప్రయత్నిస్తున్నారని, దస్తగిరి బయట ఉన్నప్పుడు బెయిల్ రద్దు చేయాలని ఎందుకు న్యాయస్థానంలో పోరాటం చేయలేదని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు.
దర్యాప్తు సక్రమంగా జరగలేదని...
తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయలేదని అంటోంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ తన ఐదేళ్ల పాలనలో ఈ హత్య కేసులో వాస్తవాలను దాచి పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వైసీపీ ఈ హత్య కేసులో నిజాలను దాచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అయితే దీనికి వైసీపీ నేతలు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది టీడీపీనేన్న విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు.
రెండేళ్ల నుంచి అధికారంలో...
అలాగే ఇప్పుడు రెండేళ్లలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. జగన్ ను వచ్చే ఎన్నికల్లోనూరాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే నర్రెడ్డి సునీతను చంద్రబాబు ఆయుధంగా ఎంచుకునట్లు కనపడుతుందని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసీపీ నేతలు అంటున్నారు. సీబీఐ అధికారులు స్పష్టంగా చెప్పినప్పుడు ఇక ఆరోపణలు చేసి ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య జరిగి ఆరేళ్లవుతున్నా ఇంకా రాజకీయంగా మాత్రం హు కిల్డ్ బాబాయ్ అన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది. వచ్చే ఎన్నికల వరకూ ఇదే విమర్శలు రెండు పార్టీల నుంచి కొనసాగుతాయి. అయితే అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనన్నది మాత్రం వాస్తవం.
Next Story

