Thu Jan 29 2026 15:27:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Vijayamma : కూతురి కోసం వైఎస్ విజయమ్మ ఆఖరి ప్రయత్నం.. జగన్ ను పక్కన పెట్టి
వైఎస్ విజయమ్మ తన కుమార్తె విజయాన్ని కాంక్షిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తన కుమార్తె విజయాన్ని కాంక్షిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో ఆమె వీడియోను విడుదల చేశారు. వైఎస్ విజయమ్మ ఇటు కుమారుడు, అటు కుమార్తెలు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండి పోటీ పడుతుండటంతో ఆమె కొంత కాలం క్రితం అమెరికాకు వెళ్లిపోయారు.
అమెరికా నుంచి...
అయితే చివరి నిమిషంలో మాత్రం తన కుమార్తెను గెలిపించాలని ఆమె వీడియో విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన కుమార్తె షర్మిలను గెలిపించాలని విజయమ్మ కడప పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను కోరారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని విజయమ్మ వీడియో లో కోరారు. వైఎస్ షర్మిలను గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. అంతే తప్ప తన కుమారుడు జగన్ ను ఆశీర్వదించాలని ఈ వీడియోలో ఆమె కోరకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

