Sun Mar 15 2026 22:57:40 GMT+0530 (India Standard Time)
వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది.

వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టైరు పేలి...
వైఎస్ విజయమ్మ ఒక ఫంక్షన్ లో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చారు. అక్కడి నుంచి వెళుతుండగా గుత్తి వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడి నుంచి విజయమ్మ వేరే కారులో బయలుదేరి వెళ్లిపోయారు.
Next Story

