Mon Feb 02 2026 06:14:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్న వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు

వైఎస్ షర్మిల నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా న్యాయయాత్ర పేరిట రాష్ట్రమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రచారం ఇలా...
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కాకినాడ పట్టణంలో జరిగే రోడ్ షోలో వైఎస్ షర్మిల పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం నాలుగు గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే రోడ్ షోలో పాల్గొని అనంతరం వైఎస్ షర్మిల బహిరంగ సభలో పాల్గొంటారు.
Next Story

