Fri Mar 20 2026 01:05:54 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : మరికాసేపట్లో చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను వైఎస్ షర్మిల నేడు కలవనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినతే చంద్రబాబు ను వైఎస్ షర్మిల నేడు కలవనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు నివాసంలో వైఎస్ షర్మిల కలవనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందచేయనున్నారు. వైఎస్ షర్మిల ఇంటికి వస్తారని ముందుగా సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వివాహ ఆహ్వాన పత్రికను...
తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహ వేడుకకు అన్ని రాజకీయ పార్టీల నేతలను, ముఖ్యులను వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రబాబును కూడా ఆమె కలసి నిశ్చితార్ధానికి, వివాహానికి రావాలని కోరనున్నారు. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతున్నారు.
Next Story

