Sun Mar 15 2026 13:41:33 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం కడప పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం కడప పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైఎస్ షర్మిల వెంట పార్టీ నేత తులసీరెడ్డితో పాటు ఆమె సోదరి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కూడా ఉన్నారు.
ఇడుపుల పాయలో...
అంతకు ముందు వైఎస్ షర్మిల ఇడుపుల పాయలో తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తనకు తల్లి, తండ్రి దీవెనలున్నాయని ఆమె తెలిపారు. కడప పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తనను ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్న షర్మిల పోటీ న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతుందని తెలిపారు.
Next Story

