Sat Dec 13 2025 22:32:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila :ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు : వైఎస్ షర్మిల
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటించారు. రైతులను పరామర్శించారు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటించారు. రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడారు. పెడన నియోజక వర్గం బంటుమిల్లి మండలంలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల - మొంథా తుపాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారన్నారు. తుపాను బీభత్సం సృష్టించిందని, ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయన్నారు. అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారన్న వైఎస్ షర్మిల ఇప్పుడు తుపాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆవేదన చెందారు. పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని, ముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. నష్టం ఎక్కువ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమో ? అని షర్మిల అన్నారు.
అంచనాలకు.. నష్టానికి...
అంచనాలకు జరిగిన నష్టానికి పొంతన లేదని వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం ఎనిమిది వందల కోట్లు మాత్రమే వ్యవసాయానికి నష్టం అంటున్నారని ప్రభుత్వ ప్రాథమిక అంచనా పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఎక్కడ రైతులను పలకరించినా ఇది అబద్ధం అంటున్నారని, అసలు సర్వే జరగలేదు అని చెప్తున్నారని వైఎస్ షర్మిల తెలిపారు. రైతుల దగ్గరకు వెళ్ళి అసలు పంట నష్టం అంచనా వేయలేదని, కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. కేవలం వరి పంట 13 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని, ప్రత్తి మూడు లక్షల ఎకరాలలో పనికి రాకుండా పోయిందన్నారు. వేరుశెనగ 1.50 లక్షల ఎకరాలు..మొక్క జొన్న 2.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్న షర్మిల తుపాను కారణంగా దాదాపు 20 వేల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.
Next Story

