Fri Dec 05 2025 14:58:31 GMT+0000 (Coordinated Universal Time)
YS Sharmila: తల్లికి వందనంపై వైఎస్ షర్మిల వెర్షనే వేరయా!!
ఏపీలో తల్లికి వందనం పథకం గురించి ఓ వైపు వైసీపీ విమర్శలు చేస్తూ ఉండగా..

ఏపీలో తల్లికి వందనం పథకం గురించి ఓ వైపు వైసీపీ విమర్శలు చేస్తూ ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల మాత్రం మరో వెర్షన్ ను తీసుకుని వచ్చారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేం అడిగితే.. బాబుకు కాంగ్రెస్ తోక పార్టీ అని విమర్శించడం కరెక్ట్ కాదని వైసీపీ నేతలపై షర్మిల ధ్వజమెత్తారు. మేం చెప్పింది ఏమిటో ఒకటికి పది సార్లు వినాలి. తల్లికి వందనం జీవో.29లో క్లారిటీ లేదని, సాక్షి కథనంపై వివరణ ఇవ్వాలని మేం చంద్రబాబును కోరామన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేం ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు గడవకముందే ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చిందన్నారు వైఎస్ షర్మిల.
2019 ఎన్నికల కంటే ముందు జగన్ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? అంటూ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. ఆ రోజు నాతో ఊరూరా, ప్రతిచోట ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో, అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ.15 వేలు చొప్పున ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజమన్నారు షర్మిల.
Next Story

