Fri Mar 20 2026 05:15:14 GMT+0530 (India Standard Time)
ఆ శుభకార్యం గురించి అధికారిక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తమ ఇంట్లో జరగబోయే శుభకార్యం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తమ ఇంట్లో జరగబోయే శుభకార్యం గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈనెల 18 తన కుమారుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం ఉంటుందని ట్విట్టర్ లో తెలిపారు. ఫిబ్రవరి 17న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు చెప్పారు. 'అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు (జనవరి 2) మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీతో పంచుకోడానికి సంతోషంగా ఉంది.' అని ట్వీట్ చేశారు.
గత కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న షర్మిల-అనిల్ దంపతుల కుమారుడు రాజారెడ్డి వివాహ తేదీని కొత్త ఏడాదిన షర్మిల ప్రకటించారు. రాజారెడ్డి, ప్రియతో కలిసి ఉన్న ఫోటోలను వైఎస్ షర్మిల పోస్టు చేశారు.
Next Story

