Sun Mar 15 2026 22:46:48 GMT+0530 (India Standard Time)
వైఎస్ జయంతి వేడుకలు విజయవాడలో
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానాికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు,ప్రముఖులు రానున్నారని ఆమె తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర క్యాబినెట్ మంత్రులను కలిసి ఆహ్వానించారు.
ఈ నెల 8వ తేదీన...
వైెఎస్సార్ తో అత్యంత సన్నిహితులుగా పేరున్న ఇతర పార్టీ నాయకులను సైతం 75 వ జయంతి వేడుకలకు ఆహ్వానించనున్నట్లు వైఎస్ షర్మిల రెడ్డి తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై, మహానేత జ్ఞాపకాలను స్మరించుకోవాలని, అలాగే అయన బిడ్డగా, అయన అహర్నిశలూ ప్రేమించి, శ్రమించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ వేడుకలు జరిపించే అవకాశం రావటం తనకు గొప్ప వరం, అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Next Story

