Tue Jan 20 2026 11:39:09 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు పదోరోజుకు చేరుకున్న జగన్ బస్సుయాత్ర
వైఎస్ జగన్ బస్సు యాత్ర నేటికి పదో రోజుకు చేరుకుంది. ఈరోజు ప్రకాశం జిల్లాలో జగన్ బస్సు యాత్ర జరగనుంది

వైఎస్ జగన్ బస్సు యాత్ర నేటికి పదో రోజుకు చేరుకుంది. ఈరోజు ప్రకాశం జిల్లాలో జగన్ బస్సు యాత్ర జరగనుంది. మేమంతా సిద్ధం యాత్ర పేరుతో జగన్ ఇడుపుల పాయ నుంచి గత నెల 27వ తేదీ నుంచి బస్సుయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ పర్యటన పూర్తి చేశారు.
నెల్లూరు జిల్లా నుంచి...
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జగన్ యాత్ర జరగనుంది. ఈరోజు సాయంత్రం కొనకనమిట్ల క్రాస్ రోడ్డు దగ్గర జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిచనున్నారు. పెదఅలవలపాడు, కనిగిరి, పెదారికట్ల మీదుగా ఇక్కడకు చేరుకుంటారు. అనంతరం సభలో ప్రసంగించిన అనంతరం బత్తులవారి పల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి చేరుకుంటారు. అక్కడ రాత్రికి బస చేయనున్నారు.
Next Story

