Tue Jan 20 2026 21:10:14 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఆరో రోజు చిత్తూరు జిల్లాలోకి జగన్
ఎస్ జగన్ బస్సుయాత్ర నేడు ఆరో రోజుకు చేరుకుంది. ఈరోజు జగన్ బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది

వైఎస్ జగన్ బస్సుయాత్ర నేడు ఆరో రోజుకు చేరుకుంది. ఈరోజు జగన్ బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈరోజు ఉదయం చీకటిమనిపల్లె నుంచి బయలుదేరి ములకలచెరువు, పెదపాలంె, వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్లుకు చేరుకుంటారు. అంగళ్లు దాటిన తర్వాత ఈరోజు జగన్ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లెకు చేరకుంటారు.
మదనపల్లెలో...
మదనపల్లెలో టిప్పు సుల్లాన్ గ్రౌండ్ వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారి పల్లె శివారులో రాత్రి బస చేయనున్నారు. జగన్ ఈ నెల 27 వ తేదీన ఇడుపుల పాయ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్గమధ్యంలో ప్రజలతో కలుస్తూ, మధ్యలో వారితో ముఖాముఖి మాట్లాడుతూ సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇచ్ఛాపురం వరకూ ఈ యాత్ర కొనసాగనుంది.
Next Story

