Wed Mar 18 2026 02:33:22 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు గుంటూరు జిల్లాలోకి మేమంతా సిద్ధం యాత్ర
వైఎస్ జగన్ బస్సు యాత్ర నేడు 11వ రోజుకు చేరుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో జరగనుంది.

వైఎస్ జగన్ బస్సు యాత్ర నేడు 11వ రోజుకు చేరుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో జరగనుంది. రాత్రి ప్రకాశం జిల్లాలోని వెంకటాచలంలో బస చేశారు. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు జగన్ బయలుదేరుతారు. తర్వాత పింఛను దారులతో ముఖాముఖి జగన్ మాట్లాడనున్నారు. అనంతరం బోదనంపాడు, కురిచేడు, చింతలచెరువు, వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకుని అక్కడి భోజన విరామానికి ఆగుతారు.
వినుకొండలో బహిరంగ సభ...
మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండలో రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా బయలుదేరి రాత్రి గంటా వారి పాలెంలో జగన్ బస చేయనున్న్నారు. ఇప్పటి వరకూ జగన్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మేమంతా సిద్ధం యాత్రను నిర్వహించారు. నేడు యాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది.
Next Story

