Sat Mar 07 2026 16:52:28 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు మాచర్లకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మాచర్లకు జగన్ చేరుకుంటారు. అక్కడ చెన్న కేశవ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
బహిరంగ సభలో...
వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 340.6 కోట్ల తో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దీనికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి కూడా అనుమతి లభించింది. పైపులైన్ల ద్వారా ఈ ప్రాంతంలో 24,900 ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నారు.
Next Story

